
కౌన్ బనేగా కరోడ్‌పతి 17 వ సీజన్ విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. హోస్ట్ అమితాబ్ బచ్చన్ నిర్వహిస్తున్న ఈ షో గ్రాండ్ గా దూసుకెళ్తుంది. ఇందులో భాగంగా అప్పుడప్పుడు క్రికెట్ పై ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు క్రికెట్ ప్రేమికులు చాలా అలవోకగా సమాధానం చెప్పేస్తారు. కానీ హాట్ సీట్ లో కూర్చున్న కంటెస్టెంట్ సమాధానం చెప్పడం కొంచెం కష్టమే. తాజాగా ఈ షో లో క్రికెట్ కు సంబంధించిన ఒక ప్రశ్న కంటెస్టెంట్ కు ఎదురైంది. ఈ ప్రశ్న ఏకంగా రూ. 50 లక్షల రూపాయల ప్రశ్న కావడం షాకింగ్ గా మారుతుంది.
వన్డే చరిత్రలో తన తొలి బంతికే వికెట్ తీసిన తొలి భారతీయ బౌలర్ ఎవరు అడిగారు. 50 లక్షల రూపాయల ప్రశ్న కావడంతో ఇది చెప్పడం అంత సామాన్యమైన విషయం కాదు. ఆప్షన్ ఏ జయ ప్రకాష్ యాదవ్.. ఆప్షన్ బి వేణుగోపాల్ రావు.. ఆప్షన్ సి సదాగోపన్ రమేష్.. ఆప్షన్ డి అబే కురువిల్లా అనే నాలుగు ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి. వీటిలో సరైన సమాధానం ఆప్షన్ సి సదాగోపన్ రమేష్. వన్డే చరిత్రలో తన తొలి బంతికే వికెట్ తీసిన తొలి భారతీయ సదాగోపన్ రమేష్ రికార్డ్ బుక్కుల్లో స్థానం సంపాదించాడు. 1999 సంవత్సరంలో సెప్టెంబర్ 6 న సింగపూర్‌లో వేదికగా కల్లాంగ్ గ్రౌండ్‌లో వెస్టిండీస్‌పై జరిగిన మ్యాచ్ లో అతను ఈ ఘనతను సాధించాడు.
అదే మ్యాచ్‌లో వెస్టిండీస్ ప్లేయర్ వేవెల్ హిండ్స్ కూడా తన మొదటి బంతికే వికెట్ పడగొట్టడం విశేషం. ఇద్దరు ఆటగాళ్ళు తమ మొదటి వన్డే బంతికే వికెట్ తీసుకున్న ఏకైక ఏకైక రికార్డు ఇది. సదాగోపన్ రమేష్ వన్డే కెరీర్ లో ఇది ఏకైక వికెట్ కావడం విశేషం. ఇండియా తరపున 19 టెస్టులు.. 24 వన్డేలు ఆడిన ఈ లెగ్ స్పిన్నర్ ఓవరాల్ గా ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టాడు. తన తొలి బంతికి తీసిన వికెటే తన చివరి వికెట్ కావడం గమనార్హం. బ్యాటర్ గా టెస్టుల్లో 1367 పరుగులు వన్డేల్లో 646 పరుగులు చేశాడు. 1999లో తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన ఈ బ్యాటర్.. అదే ఏడాది అక్టోబర్ లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు.