హీరోయిన్‌ కోసం రాసిన లవ్ లెటర్‌ని..ఆమె భర్తకే షేర్ చేసిన అభిమాని..

హీరోయిన్‌ కోసం రాసిన లవ్ లెటర్‌ని..ఆమె భర్తకే షేర్ చేసిన అభిమాని..

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ భూమిక (Bhumika Chawla). ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. భూమిక సినీ కెరీర్లో దాదాపు బాధ హీరోస్ ల మూవీస్ లో నటించారు. మెగాస్టార్ చిరంజీవి మొదలుకుని ఎన్టీఆర్‌, మహేష్ బాబు, పవన్‌ కళ్యాణ్‌, సల్మాన్ ఖాన్ లతో పాటు పలువురు స్టార్‌ హీరోలతో నటించింది.

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం..భూమిక ఒక ఇంట్రెస్ట్ విషయాన్నీ తన ఇంస్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. రీసెంట్ గా ఆమె కొత్త చీర ఫోటోలు షేర్ చేశారు. అయితే ఆ పోస్ట్ కింద భూమిక పోస్ట్ చేసిన కామెంట్ అందర్నీ ఆకర్షిస్తుంది. ఒక అభిమాని ఆమె భర్తకి ఒక లవ్ లెటర్ పంపించి. ఇది మీ భార్యకి వినిపించండి అని చెప్పుకొచ్చాడట. ఏంటో పిచ్చి..అది నాకు పంపించకుండా నా భర్తకు పంపించాడు అంటూ ఆ లెటర్‌ ను భూమిక ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్‌ చేసింది.

ఈ ఉత్తరంలో సదరు ఆ అభిమాని రాసిన ప్రేమ కావ్యం..భూమిక పై ఉన్న అభిమానంను చూపించడంతో పాటు లోతైన ప్రేమను చూపించే ప్రయత్నం చేశాడు..మీ కళ్ళు కోహినూర్..ఎంత దగ్గరికి వస్తే అంత దూరం వెళతావు..మీ అందం ఎంతో సున్నితత్వం..ఏది ఏమైనప్పటికీ, అది విశ్వం కంటే మెరుగైనది..అంటూ తనలోని కవి సామ్రాజ్యాన్ని పొందుపరిచాడు.

నిజానికి ఎవరైనా ప్రేమిస్తే డైరెక్ట్ గా ప్రేమ లేఖలు ఇస్తారు. కానీ, ఇలా తనను ప్రేమను వారి జీవిత భాగస్వామికి పంపించడం ఏంట్రా బాబు అంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరైతే..ఏదో ఒక విధంగా భూమిక దృష్టిలో పడ్డ ప్రేమాభిమాని  లక్కీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏదీ ఏమైనా..నాలుగు పదుల వయస్సులో లవ్ లెటర్స్ అందుకోవడం మామూలు విషయం కాదులేండీ!

2007 సంవత్సరంలో భూమిక తన యోగా గురువు భరత్‌ ఠాకూర్‌ ని పెళ్లి చేసుకున్నారు. కవిత్వం అంటే ఎంతో ఆసక్తి ఉన్న భూమికను.. తమ కవిత్వాలతో ప్రేమలో ముంచకండి సుమా!