వికారాబాద్, వెలుగు: ఓ రైతు వికారాబాద్కలెక్టరేట్ఎదుట ఆత్మహత్యాయత్నం చేశాడు. తన భూ సమస్య పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. కొడంగల్ మండలంలోని ఖాజా హైమద్పల్లికి చెందిన శ్రీనివాస్ వ్యవసాయ భూమి 6 ఎకరాలు అటవీ శాఖ భూములకు ఆనుకొని ఉంది. అయితే ఇందులో 20 గుంటల భూమి తమదని అటవీ శాఖ అధికారులు.. కాదు తనదేనని శ్రీనివాస్అంటున్నారు.
ఏళ్లుగా ఈ వివాదం నడుస్తోంది. శ్రీనివాస్ సమస్యను పలుమార్లు కలెక్టర్, అటవీ శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకపోయింది. దీంతో గురువారం తాడుతో కలెక్టరేట్‌కు వచ్చాడు. గేట్ఎక్కి ఉరేసుకునేందుకు ప్రయత్నించగా అక్కడే ఉన్న హోంగార్డు పవన్‌కుమార్ అడ్డుకున్నాడు. ఈ విషయమై డీఎఫ్‌వో జ్ఞానేశ్వర్‌ను వివరణ కోరగా.. త్వరలో రెవెన్యూ, అటవీ శాఖ అధికారులతో సర్వే చేపట్టి, శ్రీనివాస్భూమి అటవీ శాఖ ఆధీనంలో ఉన్నట్లు తేలితే తిరిగి ఇచ్చేస్తామని తెలిపారు.
