మోడల్ స్కూల్ టీచర్ అనుమానాస్పద మృతి.. రంగారెడ్డి జిల్లాలో ఘటన

మోడల్ స్కూల్ టీచర్ అనుమానాస్పద మృతి.. రంగారెడ్డి జిల్లాలో ఘటన

ఇబ్రహీంపట్నం, వెలుగు: రంగారెడ్డి జిల్లా ఆరుట్లలోని తెలంగాణ మోడల్ స్కూల్ టీచర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.  మేడ్చల్ జిల్లా ఉప్పల్ చిలుకనగర్​కు చెందిన శంబెళ్ల సతీష్ కుమార్ (47) ఆరుట్ల మోడల్ స్కూల్లో మ్యాథ్స్​టీచర్​గా పనిచేస్తున్నాడు.  కొంతకాలంగా కుటుంబానికి దూరంగా ఉంటూ ఇబ్రహీంపట్నంలో అద్దెకు ఉంటున్నారు.

ఆదివారం ఆయన తన గదిలోని బాత్రూంలో ఒంటిపై దుస్తులు లేకుండా మృతి చెంది పడి ఉన్నాడు. గమనించిన ఇంటి యజమాని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.