కరీంనగర్: కరీంనగర్ బేకరీలో అగ్ని ప్రమాదం జరిగింది. కరీంనగర్ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలోని బేకరీలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒక్కసారిగా చెలరేగిన మంటలతో బేకరీలో భారీ నష్టం జరిగింది.
ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. బేకరీలోని సామాగ్రి, ఎలక్ట్రికల్ పరికరాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రమాదంలో ప్రాణ నష్టం లేకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అగ్నిప్రమాదానికి కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
నార్కట్‌పల్లి మండలం చెరువుగట్టు గ్రామంలో కూడా భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ధర్మకర్త శ్రావణయ్య షాపులో మొదట మంటలు చెలరేగినట్లు సమాచారం. అక్కడి నుంచి పక్కనే ఉన్న దుకాణాలకు మంటలు వేగంగా వ్యాపించాయి. 15 పెద్ద దుకాణాలు, 15 చిన్న దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి.
సుమారు ₹75 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు పోలీసులు అంచనా వేశారు. గ్రామ పంచాయతీ భవనం కూడా మంటల్లో దగ్ధమైంది. మూడు ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు.
