బాచుపల్లి అపార్ట్ మెంట్ లో భారీ కొండచిలువ..సెకండ్ ఫ్లోర్ వరకు ఎలా వచ్చింది.?

బాచుపల్లి అపార్ట్ మెంట్ లో భారీ కొండచిలువ..సెకండ్ ఫ్లోర్ వరకు ఎలా వచ్చింది.?

హైదరాబాద్ బాచుపల్లిలోని  ఓ అపార్ట్ మెంట్ లో భారీ కొండ చిలువ కలకలం రేపింది. ఏకంగా రెండో ఫ్లోర్ లో కొండ చిలువ కనిపించడంతో అపార్ట్ మెంట్ వాసులు భయాందోళనకు గురయ్యారు. కిటీలో నుంచి గదిలోకి దూరడం చర్చనీయాంశంగా మారింది. 

బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రెడ్డి ల్యాబ్ సమీపంలోని ఓ అపార్ట్ మెంట్ లో  అక్టోబర్ 8న  కొండచిలువ దర్శనమిచ్చింది. రెండవ అంతస్తులో కొండచిలువను గమనించిన అపార్ట్ మెంట్  వాసులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్నేక్ సొసైటీ సభ్యులకు సమాచారం అందించగా వారు తక్షణమే సంఘటన స్థలానికి చేరుకొని జాగ్రత్తగా భారీ కొండచిలువను పట్టుకున్నారు. 

అనంతరం దానిని సురక్షితమైన అటవీ ప్రాంతంలో వదిలేశారు.ఈ సంఘటనతో అపార్ట్మెంట్ వాసులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆ కొండచిలువ అపార్ట్మెంట్ రెండవ అంతస్తు వరకు ఎలా చేరిందనేది అర్థం కావడం లేదు. పోలీసులు, స్నేక్ సొసైటీ సభ్యులు దీనిపై సమగ్రంగా విచారణ జరుపుతున్నారు.