కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇవ్వాల భారీ ర్యాలీ

కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇవ్వాల భారీ ర్యాలీ
  •      నీట్ అక్రమాలపై విచారణ జరపాలని డిమాండ్

హైదరాబాద్, వెలుగు: నీట్ అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని కోరుతూ శుక్రవారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు.  గాంధీభవన్ నుంచి ట్యాంక్ బండ్ లోని అంబేద్కర్ విగ్రహం వరకు ఈ ర్యాలీ కొనసాగనుందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ తెలిపారు. ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ ర్యాలీని నిర్వహించనున్నామని చెప్పారు. గురువారం హైదరాబాద్ లో మీడియాకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.