క్యాబ్​లు తొలగించాడని కక్ష గట్టి కత్తితో దాడి

క్యాబ్​లు తొలగించాడని కక్ష గట్టి కత్తితో దాడి

మాదాపూర్, వెలుగు :  కంపెనీ  నుంచి క్యాబ్​ల​ తీసివేతకు కారణమయ్యాడని క్యాబ్​ సూపర్​వైజర్​పై ఓ క్యాబ్​ డ్రైవర్​కత్తితో దాడి చేసిన ఘటన  మాదాపూర్​ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. మాదాపూర్​ పోలీసుల వివరాల ప్రకారం.. పహాడిషరీఫ్​కు చెందిన రియాజ్, ఇర్ఫాన్​లు మాదాపూర్​లోని ఓ సాఫ్ట్​వేర్​కంపెనీలో క్యాబ్​లు పెట్టారు. ఇర్ఫాన్ డ్రైవర్ గా... రియాజ్​ క్యాబ్స్​సూపర్​వైజర్​గా చేస్తున్నారు. ఇర్ఫాన్​ సరిగా డ్యూటీ చేయకపోవడంతో అతనిపై  రిమార్క్​పెట్టారు. దీంతో రెండు నెలల కిందట ఇర్ఫాన్​క్యాబ్​లను కంపెనీ నుంచి తొలగించారు.

దీంతో తన కార్లను తొలగించడానికి రియాజ్​నే కారణమని ఇర్ఫాన్ కక్ష గట్టాడు. బుధవారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో కంపెనీ వద్ద రోడ్డుపై నిలబడ్డ రియాజ్​పై ఇర్ఫాన్​ కత్తితో దాడి చేయగా, ఎడమ చేతికి గాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే సమీపంలోకి ఆస్పత్రికి తరలించారు. బాధితుడు రియాజ్​కంప్లయింట్ తో  నిందితుడిపై కేసు నమోదు చేసి చేశామని మాదాపూర్​ పోలీసులు తెలిపారు.