ఎల్కతుర్తి: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో కారులో గుర్తుతెలియని శవం లభ్యమైంది. గుర్తుతెలియని వ్యక్తులు గత రెండు రోజులుగా అక్కడే కారును వదిలేసి వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. కారు నుంచి దుర్వాసన రావడంతో పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. పోలీసులు స్పాట్కు చేరుకుని కారును పరిశీలించారు.
డిక్కీలో దుప్పట్లో మూటగట్టి శవం కనిపించే సరికి స్థానికులు విస్తుపోయారు. స్థానికంగా భయాందోళన వ్యక్తమైంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారిస్తున్నారు.
