ఫోన్ చూస్తుండగా కాటేసిన తాచుపాము.. హైదరాబాద్లోని కుత్బుల్లాపూర్ బౌరంపేటలో విషాదం

ఫోన్ చూస్తుండగా కాటేసిన తాచుపాము.. హైదరాబాద్లోని కుత్బుల్లాపూర్ బౌరంపేటలో విషాదం

హైదరాబాద్: కుత్బుల్లాపూర్ బౌరంపేటలో విషాద ఘటన జరిగింది. ఒక కన్ స్ట్రక్షన్లో ఉన్న బిల్డింగ్కు వాచ్ మెన్గా ఉంటున్న గోపీ అనే 45 ఏళ్ల వ్యక్తిని పాము కాటేసింది. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ నిర్మాణ భవనం దగ్గర ఈ ఘటన జరిగింది. మధ్యాహ్నం ఫోన్ చూస్తుండగా గోపిని తాచుపాము కాటేసింది.

పాము కాటుకు గురైన్ వాచ్‌మెన్ అక్కడే స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే.. సూరారంలోని మల్లారెడ్డి హాస్పిటల్కి కుటుంబ సభ్యులు అతనిని తరలించారు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ వాచ్‌మెన్ గోపి ప్రాణాలు కోల్పోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

వానాకాలం వస్తే పాములకు పండుగే. ఈ కాలంలో అవి హాయిగా తిరుగుతాయి. కావాల్సినంత ఫుడ్డు దొరుకుతుంది. స్వేచ్ఛగా తిరిగేటందుకు ఎక్కడ చూసినా పొదలే ఉంటాయి. చాలాజాతుల పాములు వానాకాలంలోనే జతకట్టి, సంతానం కూడా పెంచుకుంటాయి. కానీ.. వానల చాటున మనుషులకు మాత్రం పాముల ముప్పు పొంచి ఉంది. వానలు పడినప్పుడల్లా వాటి పుట్టలు, కలుగులు నీళ్లతో నిండుతాయి.

పాములు కాస్త నీళ్లులేని పొడి ప్రదేశం కోసం బయలుదేరతాయి. మనుషులు ఎదురయ్యేసరికి భయంతో టపీమని కాటువేసి పోతాయి. మనుషులు మాత్రం సగం విషంతో, మరో సగం భయంతో వణికిపోయి ప్రాణాలొదిలేస్తున్నారు.