
దుండిగల్, వెలుగు: నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి చెందాడు. దుండిగల్ పీఎస్ పరిధిలోని సారెగూడెం గ్రామానికి చెందిన పెద్దిరిగారి శ్రీశైలం (36) తన ఇంట్లోని నాలుగో అంతస్తులో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడ్డాడు. తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. శ్రీశైలంకు భార్య, ఒక కొడుకు కూతురు ఉన్నారు.