V6 News

ఉప్పల్ స్కైవాక్ నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్యాయత్నం

ఉప్పల్ స్కైవాక్ నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్యాయత్నం

ఉప్పల్, వెలుగు: ఉప్పల్ స్కైవాక్ నుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. సంగారెడ్డి జిల్లాకు చెందిన ఫ్రాన్సిస్ (34) సోమవారం ఉప్పల్ రింగ్ రోడ్​వద్దకు వచ్చాడు. స్కైవాక్ పైకి ఎక్కి ఉన్నట్టుండి ట్రాఫిక్ పోలీస్ బూత్ గొడుగుపై దూకాడు. దీంతో స్వల్పంగా గాయపడిన బాధితుడిని పోలీసులు స్థానిక పీహెచ్ సీకి తరలించారు. సదరు వ్యక్తిని విచారించగా, అతడి మానసిక పరిస్థితి సరిగా లేదని పోలీసులు తెలిపారు.