వెలుగు స్పెషల్ : రీల్స్ దాటి రియల్ లైఫ్.. కల పెద్దది, దారి గట్టిది

వెలుగు స్పెషల్ : రీల్స్ దాటి రియల్ లైఫ్.. కల పెద్దది, దారి గట్టిది

రైతు కుటుంబంలో పుట్టి,  హైదరాబాద్‌‌లో  ఫైన్ ఆర్ట్స్ చదివిన  రేవంత్ రెడ్డి  రాజకీయాల్లోకి  రాకముందే  ‘ఒకరోజు ముఖ్యమంత్రి అవుతా’ అని  అన్నారని  సన్నిహితుడి జ్ఞాపకం.  అప్పట్లో అది పెద్ద మాట. వెనక్కి చూస్తే తనకు తానే పెట్టుకున్న టార్గెట్.  

జెడ్పీటీసీ  నుంచి  ఎమ్మెల్సీ,  ఎమ్మెల్యే,  ఎంపీ,  ముఖ్యమంత్రి దాకా ప్రతి మెట్టూ పోరాటంతోనే  ఎక్కారు.  ‘పడితే  లేవాలి,  లేస్తే ముందుకు నడవాలి’ ఆ ప్రయాణం చెప్పే సింపుల్ లెసన్ ఇదే.  వివేకానందుడి మాటల్లో  చెప్పాలంటే.. ‘లేవండి,   మేల్కొనండి,   లక్ష్యం  చేరేవరకు  ఆగకండి’. 

జెన్​జీ కోసం..

18 ఏళ్లకే  ఓటు వేస్తున్న యువత 21 ఏళ్లకే  చట్టసభలకు ఎందుకు  పోటీచేయకూడదు?  
ఎమ్మెల్యే, ఎంపీగా పోటీచేసే కనీస వయస్సును 25 నుంచి 21కి తగ్గించాలనే ఆలోచనతో,  తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు  పంపాలన్న  ప్రతిపాదన  చర్చకు వచ్చింది.  తీర్మానం ఒక్కటే  చట్టం మార్చదు.  రాజ్యాంగ,  చట్ట సవరణలు పార్లమెంటు పరిధిలోనే జరుగుతాయి. 

 అయినా ‘మన ఫ్యూచర్​ గురించి మనమే మాట్లాడాలి’ అనే  జెన్​జీ  మాటను  జాతీయ వేదికకు తీసుకెళ్లడం మంచి ఆరంభం.  యువత  పోస్టర్లు మోసే చేతులుగానే కాదు, పాలసీరాసే  మైండ్స్‌‌
గానూ ఎదగాలి.

క్లాస్ రూమ్ నుంచి ప్లేగ్రౌండ్ దాకా ఫుల్ పవర్​

యంగ్ ఇండియా పాఠశాలలు,  స్కిల్స్ యూనివర్సిటీ,  క్రీడా విశ్వవిద్యాలయం.. వీటి అసలు వాల్యూ భవనాల పేర్లలో కాదు,  పిల్లలకు  దక్కే అవకాశాల్లో ఉంది.  మంచి టీచర్లు, ల్యాబ్స్,  డిజిటల్ లెర్నింగ్,  కోచింగ్,  పోషకాహారం.

 ‘ఫ్యూచర్​ రెడీ’ అని చెప్పడం  ఈజీ.   అసలు  స్కోర్​బోర్డ్​ మాత్రం ఉద్యోగం దొరికిందా,  ఆటగాడు ఎదిగాడా,  చేతికి  స్కిల్​ వచ్చిందా అన్నదే.   డిగ్రీకే  సాథ్​ స్కిల్​ భీ,  మెడల్​కే  సాథ్​ మౌకా భీ.. అప్పుడే ఫుల్ ప్యాకేజ్.  జెన్​ అల్ఫాకి కలలు చూపడమే కాదు,  వాటిని చేరే  స్టెప్స్‌‌ను కూడా ఏర్పాటుచేయాలి.

ఫామ్ నుంచి ప్యూచర్​ సీటీ దాకా

ఏఐ,  లైఫ్​ సైన్సెస్, ఆధునిక  పరిశ్రమలు, భారత్  ఫ్యూచర్ సిటీ.. తెలంగాణకు కొత్త అవకాశాల తలుపులు తెరవగలవు.  కానీ  సిటీ సూపర్​ అంటే  ప్రజల జీవితం కూడా సూపర్​ కావాలి.  డెవెలప్‌‌మెంట్ కా మత్లబ్​ స్కైలైన్​ మాత్రమే కాదు,  ఇంటింటి ఇన్‌‌కమ్​కూడా.  రైతుకు నీరు,  మార్కెట్,  నిల్వ,  ప్రాసెసింగ్,  కార్మికుడికి  గౌరవ వేతనం,  భద్రత, స్కిల్, యువతకు  స్థానిక ఉద్యోగం.. ఇవి ప్యాకేజ్‌‌లో ఉండాలి.  

హైదరాబాద్‌‌తోపాటు  కరీంనగర్, వరంగల్,  ఖమ్మం,  నిజామాబాద్  కూడా  గ్రోత్​ మ్యాప్‌‌లో  బలమైన  కేంద్రాలవ్వాలి.  రైతు, వర్కింగ్ క్లాస్,  టెక్​రంగం కలిసి నడిచినప్పుడే  ‘తెలంగాణ రైజింగ్–2047’కు  రియల్ మీనింగ్​వస్తుంది.

విజన్​ వైరల్​ కావాలి 

రుణమాఫీ,  రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు,  మహిళల ప్రయాణ సౌకర్యం వంటి పథకాలు అర్హుల చేతికి సమయానికి చేరాలి.  నాణ్యమైన పాఠశాల, మెరుగైన ఆసుపత్రి, స్థిరమైన ఉద్యోగం, ఆదాయం ఇచ్చే వ్యవసాయం కూడా అంతే ముఖ్యం.  రీల్స్‌‌లో  విజన్ ​ ఒక నిమిషం.  గ్రౌండ్​మీద  డెలివరీకి  రోజువారీ పని కావాలి.  ‘చుక్కాని ఉంటేనే పడవ గమ్యానికి చేరుతుంది’.. ప్రకటనకు టైమ్​లైన్, అమలుకు అకౌంటబులిటీ, ప్రజలకు కనిపించే రిజల్ట్ జత కావాలి.

బర్త్​డే విష్‌‌కి మించి ప్రజల ఆశ

ఈ జన్మదినం సందర్భంగా తెలంగాణ ప్రజల తరఫున ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డికి  శుభాకాంక్షలు. ఈ ఆలోచనలు  యువతకు  చదువు,  క్రీడ,  ఉద్యోగం, నాయకత్వంలో  నిజమైన అవకాశాలుగా మారాలి.   రైతు, కార్మికుడి  జీవితాల్లోనూ  మార్పు  కనిపించాలి.  ‘జహా చాహా, వహా రహ’.. కానీ 
ఆ దారిని  తెరవాల్సింది  నిర్ణయాలూ, అమలు.  బర్త్​డే విషెస్.  అసలైన గిఫ్ట్  ప్రజల ఆశలలో,​ యువతకు  తెరుచుకునే  కొత్త  ద్వారాల్లో ఉన్నాయి.

- వెలిచాల  రాజేందర్ రావు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు-

గమనిక: ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ [email protected] 
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు