ఇండస్ట్రియల్, టెక్నాలజీ ఎకో సిస్టమ్ బలోపేతం

ఇండస్ట్రియల్, టెక్నాలజీ ఎకో సిస్టమ్ బలోపేతం

హైదరాబాద్, వెలుగు: ఫిన్‌‌‌‌టెక్, గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాలకు హైదరాబాద్‌‌‌‌ను అంతర్జాతీయ స్థాయి కేంద్రంగా తీర్చిదిద్దాలన్నదే తమ లక్ష్యమని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. గ్లోబల్ కంపెనీలు తమ కార్యకలాపాలను హైదరాబాద్ కు విస్తరించేలా ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజీ ఎకో సిస్టంను మరింత బలోపేతం చేస్తున్నామన్నారు. ప్రపంచ స్థాయి డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పన, అడ్వాన్స్ డ్ టెక్నాలజీస్ లో పరిశోధన, అభివృద్ధి( ఆర్ అండ్ డీ)కి ప్రోత్సాహం, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యం కలిగిన మానవ వనరులను తీర్చిదిద్దడంపై ప్రత్యేకంగా దృష్టి సారించామన్నారు.

సింగపూర్ కేంద్రంగా పనిచేస్తున్న ఆర్థా ఫిన్‌‌‌‌టెక్ ఆఫీసును శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ ఐటీ, ఐటీఈఎస్ రంగంలో హైదరాబాద్ సాధించిన అంతర్జాతీయ గుర్తింపును ఫిన్‌‌‌‌టెక్, డిజిటల్ బ్యాంకింగ్, గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాలకూ విస్తరించేలా కృషి చేస్తున్నామన్నారు.