నెక్కొండ, వెలుగు: ప్రియురాలు పెండ్లికి నిరాకరించడంతో వరంగల్ జిల్లా నెక్కొండ మండలం వాగ్యా నాయక్ తండాకు చెందిన ఓ యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. ఎస్సై మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన బానోత్ నాగరాజు(25) చెన్నారావుపేట మండలం పాపయ్యపేటకు చెందిన ఓయువతి ఆరేండ్లుగా ప్రేమించుకుంటున్నారు. కొన్ని రోజుల కింద వివాహం చేసుకుందామని నాగరాజు చెప్పగా, ఆ యువతి నిరాకరించింది. దీంతో మనస్తాపానికి గురై ఈ నెల16న తన వ్యవసాయ బావి వద్ద నాగరాజు గడ్డి మందు తాగాడు. కుటుంబసభ్యులు అతడిని చికిత్స కోసం హనుమకొండలోని ఓప్రైవేట్ హాస్పిటల్ కు తీసుకెళ్లగా, మంగళవారం చనిపోయాడు. మృతుడి తండ్రి రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
