బీజేపీ కార్పొరేటర్ వేధింపులు... యువకుడు ఆత్మహత్య

 బీజేపీ కార్పొరేటర్ వేధింపులు... యువకుడు ఆత్మహత్య

బీజేపీ కార్పొరేటర్ ఫోన్ వేధింపులు తట్టుకోలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.  ఈ ఘటన నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.  శ్రీనివాస కాలనీలో నివాసముండే చలమల్ల బాలవర్ధన్ రెడ్డి (36) అనే వ్యక్తిని గడ్డిన్నారం డివిజన్  కార్పొరేటర్  బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి గత కొన్ని రోజులుగా వేధింపులకు గురిచేస్తుండటంతో  తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కార్పొరేటర్ తో పాటుగా మరో ఇద్దరిపై కేసు నమోదు చేశారు.  కాగా ఇప్పటికే 2022లో ఓ యవకుడిని కిడ్నాప్ చేసిన ఘటనలో  ప్రేమ్ మహేశ్వర్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.  

ALSO READ :- మీకు తెలుసా : ఒక బండి..ఒక ఫాస్టాగ్ రూల్ వచ్చేసింది..ఏంటీ నిబంధన