మీకు తెలుసా : ఒక బండి..ఒక ఫాస్టాగ్ రూల్ వచ్చేసింది..ఏంటీ నిబంధన

మీకు తెలుసా : ఒక బండి..ఒక ఫాస్టాగ్ రూల్ వచ్చేసింది..ఏంటీ నిబంధన

మీకు ఫోర్ వీలర్ వెహికల్ ఉందా..మీరు ఫాస్టాగ్ తీసుకున్నారా..అయితే ఒకే ఫాస్టాగ్ ను మల్టిపుల్ వెహికల్స్కు వినియోగిస్తున్నారా.. లేదా ఒకే వెహికల్కు వివిధ ఫాస్టాగ్లనుంచి చెల్లిస్తున్నారా..ఇవాళ్లి నుంచి అంటే ఏప్రిల్ 1 నుంచి అవన్నీ యాక్సెప్టబుల్ కాదు. ఎందుకు..మరీ వెహికల్స్కు ఫాస్టాగ్ ఎలా చెల్లించాలి.. అనే అంశాలపై  ‘‘వన్ వెహికల్.. వన్ ఫాస్టాగ్’’ రూల్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.. 

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) కొత్త ఫాస్టాగ్ రూల్స్ను తీసుకొచ్చింది..ఒకే వెహికల్..ఒకే ఫాస్టాగ్ అనే కొత్త రూల్ను అమలు చేస్తోంది. ఈ రూల్స్ సోమవారం ( ఏప్రిల్ 1) నుంచే అమలు చేస్తోంది. కొత్త రూల్స్ ప్రకారం.. ఒక వాహనం ఒక ఫాస్టాగ్ మాత్రమే కలిగి ఉండాలి. అంటే ఒకే ఫాస్టాగ్పై మల్టీపుల్ వెహికల్స్ ఫాస్టాగ్ చెల్లించడం గానీ, వివిధ రకాల ఫాస్టాగ్లనుంచి ఒకే వెహికల్కు టోల్ గేట్ల వద్ద చెల్లింపులు చేయడంగానీ అనుమతించబడదు. 
ఎలక్ట్రానిక్ టోల్ సేకరణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు, టోల్ ప్లాజాల వద్ద అంతరాయం లేని ప్రయాణాన్ని అందించేందుకు NHAI   ‘‘వన్ వెహికల్.. వన్ ఫాస్టాగ్’’ రూల్  అమలు చేస్తోంది. 

ఇదిలా ఉంటే.. మార్చి 15లోగా కస్టమర్లు, వ్యాపారస్తులు తమ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్  అకౌంట్లను ఇతర బ్యాంకులకు మార్చుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచించింది. 

ALSO READ :- ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, వివేక్

దేశంలోని ఎలక్ట్రానిక్స్ టోల్ కలెక్షన్ సిస్టమ్లో ఫాస్టాగ్ ఓ విప్లవాత్మకమైన మార్పు. ఫాస్టాగ్ అనే ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్ ఆఫ్ ఇండియాను నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) నిర్వహిస్తోంది. ఇది 8కోట్ల యూజర్లతో 98 శాతం పెనెంట్రేషన్ రేటును కలిగి ఉంది. లింక్ చేయబడిన అకౌంట్ నుంచి నేరుగా టోల్ చెల్లింపులు చేసేందుకు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) టెక్నాలజీని వినియోగిస్తుంది.