ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, వివేక్

ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, వివేక్

 రంజాన్‌ పండుగను పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం ప్రగతి జూనియర్ కళాశాలలో ముస్లింలు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ , చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకట్ స్వామి పాల్గొన్నారు. ఈ విందులో భారీగా  ముస్లిం సోదరులు పాల్గొన్నారు.   ఇఫ్తార్ విందులో మైనారిటీ నాయకులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

పెద్దపల్లి పట్టణంలోని ఎంబీ గార్డెన్ లో ఇఫ్తార్ విందులో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు,పెద్దపల్లి పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ పాల్గొన్నారు.  ప్రత్యేక ప్రార్థనల అనంతరం ఇఫ్తార్ విందు ను ప్రారంభించారు ఎమ్మెల్యే. ఈ సందర్భంగా  ఎమ్మెల్యే విజయ రమణారావు, గడ్డం వంశీ కృష్ణను శాలువాతో సత్కరించారు ముస్లిం సోదరులు.

ALSO READ :- Kalyani Vaccha Full Video: కల్యాణి సాంగ్ మిడిల్ క్లాస్లా ఉంటుందనుకుంటే..అంబానీ ఇంట్లో పెళ్లిలా ఉందిగా!