Kalyani Vaccha Full Video: కల్యాణి సాంగ్ మిడిల్ క్లాస్లా ఉంటుందనుకుంటే..అంబానీ ఇంట్లో పెళ్లిలా ఉందిగా!

Kalyani Vaccha Full Video: కల్యాణి సాంగ్ మిడిల్ క్లాస్లా ఉంటుందనుకుంటే..అంబానీ ఇంట్లో పెళ్లిలా ఉందిగా!

స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ది ఫ్యామిలీ స్టార్ (The FamilyStar). సీతారామం(Sitaramam) ఫేమ్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తున్నారు. 

రీసెంట్గా  ఫ్యామిలీ స్టార్ నుంచి వచ్చిన సెకండ్ సింగిల్ 'కళ్యాణి వచ్చా వచ్చా'..అంటూ సాగే వెడ్డింగ్ సాంగ్ ఫుల్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సెలబ్రేషన్ సాంగ్ ఆడియన్స్ ను భళే ఆకట్టుకుంటోంది.ఈ మూవీ ఏప్రిల్ 5న విడుదల కాబోతున్న నేపథ్యంలో కళ్యాణి సాంగ్ ఫుల్ వీడియోను రిలీజ్ చేయడంతో ఆడియన్స్ అట్ట్రాక్ట్ అవుతున్నారు.

కల్యాణి వచ్చా వచ్చా పంచ కల్యాణి తెచ్చా తెచ్చా..సింగారీ చెయ్యందించా, ఏనుగంబారీ సిద్ధంగుంచా..ధమకు ధమా ధమారి, ఛమకు ఛమా ఛమారి, సయ్యారి సరాసరి మొదలుపెట్టే సవారి, డుమకు డుమా డుమారి, జమకు జమా జమారి, ముస్తాభై ఉన్నామని అదరగొట్టేయ్ కచేరి.. అంటూ ఉన్న లిరిక్స్ కి డ్యాన్స్ స్టెప్పులు బాగున్నాయి.

గోపీ సుందర్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ కు అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించగా..మంగ్లి, కార్తీక్ ఆలపించారు. సాంగ్ లో విజయ్, మృణాల్ బ్యూటిఫుల్ కెమిస్ట్రీ ఆకట్టుకుంది. హుషారుగా ఉన్న ఈ మ్యారేజ్ సాంగ్‍ కూడా బాగా పాపులర్ అయ్యేలా ఉంది.

ALSO READ :- కవితకు అవసరమైన వసతులు కల్పించండి.. జైలు అధికారులకు కోర్టు ఆదేశాలు

ఫ్యామిలీ స్టార్ నుంచి పెళ్లి పాట అనగానే ఏదో మిడిల్ క్లాస్ లా ఉంటుందని అందరు అనుకుంటే..మరి అంబానీ ఇంట్లో పెళ్లిలా ఉంది.ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ (SVC54) పై దిల్ రాజు (Dil raju) నిర్మిస్తున్నారు.

  • Beta
Beta feature