వరదనీటిలో నిద్ర..ఇదేమి ఆనందమో..!

వరదనీటిలో నిద్ర..ఇదేమి ఆనందమో..!

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లు నదులను తలపిస్తున్నాయి. వరదనీరు పొంగిపొర్లుతుండటంతో..వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఓ వ్యక్తి మాత్రం వరదలను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు. మలాద్ ఏరియాలో వరదల్లో జలకాలాడుతున్నాడు. రోడ్డుపై వరద నీటిలో హాయి విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఓ వైపు వెహికిల్స్ వెళ్తున్నా..ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. వాహనాలు పోతున్నా..జనాలు చూస్తున్నా..తనకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నాడు. రోడ్డుపై వ్యక్తి నిద్రపోతున్న వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.