సెల్లార్ నీటిలో చిక్కుకుని వ్యక్తి మృతి

సెల్లార్ నీటిలో చిక్కుకుని వ్యక్తి మృతి

హైదరాబాద్ లో శుక్రవారం రాత్రి కురిసిన వర్షం ఓ ప్రాణం తీసింది. భారీ వర్షానికి ముషీరాబాద్ లో ఓ వ్యక్తి చనిపోయాడు. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షానికి ఓ అపార్ట్ మెంట్ లోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో సెల్లార్ లో ఉన్న నీటిలో చిక్కుకుని బి. రాజ్ కుమార్ అనే వ్యక్తి చనిపోయాడు. ఈయన వయసు 54 ఏళ్లు. హైకోర్టులో పనిచేస్తున్నట్లుగా గుర్తించారు.

సెకండ్ ఫ్లోర్ లో ఉన్న రాజ్ కుమార్ బయటకు వెళ్దామని కిందకి దిగగా…సెల్లర్లో నీరు చూసుకోకుండా ముందుకు వెళ్లడంతో అందులో పడిపోయాడు. ప్రమాదానికి కారణం సెల్లర్ లో ఉన్న నీళ్లలో షాట్ సర్క్యూట్ రావడం వల్లే జరిగిందని పోలీసులు తెలిపారు. డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశామన్నారు.