సిటీలో భారీ వర్షం.. గంట తర్వాత మళ్లీ ఎండ

సిటీలో భారీ వర్షం.. గంట తర్వాత మళ్లీ ఎండ
  • హైదరాబాదులో వాతావరణ పరిస్థితి
  • మరో 4 రోజులు వానలుంటాయన్న వాతావరణశాఖ 

హైదరాబాద్లో విచిత్ర వాతావరణం నెలకొంది. కాసేపు ఎండ మరికాసేపు వర్షంతో జనం అవస్థలు పడుతున్నారు. ఒక్కసారిగా భారీ వర్షం పడటంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జాం అయి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  ఖైరతాబాద్ గణేష్ ఎదుట, ప్రభుత్వ హాస్పిటల్ ఎదురుగా భారీగా వర్షం నీరు చేరింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ సిబ్బంది వర్షపు నీటిని తొలగిస్తున్నారు. 

10 గంటల తర్వాత నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. సిటీలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అరగంటకు పైగా కుండపోత.. ఆ తర్వాత తుంపరగా వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. సికింద్రాబాద్, కంటోన్మెంట్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్ పేట్  ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. భారీ వర్షంతో రోడ్లపై భారీగా వరద నీరు చేరుకుంది. దీంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఎదురైతుంది. ఆఫీసులకు వెళ్లే టైంలో..భారీ వర్షం పడడటంతో ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు. పంజాగుట్ట, అమీర్ పేట్ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.

కురిసిన వర్షపాతం వివరాలు
రాష్ట్రంలో పలు జిల్లాల్లో హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలే కాకుండా మల్కాజిగిరి.. హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదయింది. ఉదయం నుంచి ఎండ కాచి.. పది గంటల తర్వాత మళ్లీ మబ్బులు కమ్మేసి.. గంటసేపు భారీ వర్షం కురిసింది. ఆ తర్వాత మళ్లీ ఎండ కాస్తోంది.

ఇవాళ ఉదయం 10 గంటల తర్వాత కురిసిన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. 

మేడ్చల్ మల్కాజిగిరి ప్రశాంత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద 7.3 సెంటీమీటర్లు
వెస్ట్ మారేడ్ పల్లిలో 6.6 సెంటీమీటర్లు
మేడ్చల్ మల్కాజ్ గిరి పరిధిలోని మధుసూదన్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద 6.3 సెంటీమీటర్లు
మేడ్చల్ మల్కాజ్ గిరి పరిధిలోని రాజీవ్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద 5.5 సెంటీమీటర్లు
మేడ్చల్ మల్కాజిగిరి లోని మహేశ్వర్ నగర్ వార్డ్ ఆఫీస్ వద్ద 3.7
మేడ్చల్ మల్కాజ్ గిరి పరిధిలోని చిల్కానగర్లో 3.1 సెంటీమీటర్లు
మేడ్చల్ మల్కాజిగిరి మెట్టుగూడ గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ వద్ద 4.6 సెంటీమీటర్లు

సికింద్రాబాదు మెట్టుగూడా గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ వద్ద 4.6 సెంటీమీటర్లు
కాప్రాలోని రాజ్యం నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద 5.5 సెంటీమీటర్లు
సీతాఫల్ మండి కింది బస్తీ కమ్యూనిటీ హాల్ వద్ద 3.2 సెంటీమీటర్లు
సికింద్రాబాద్లోని జిహెచ్ఎంసి బిల్డింగ్స్ వద్ద 2.4

అంబర్ పేట్ విటల్ వాడిలో 2.8 సెంటీమీటర్లు
గాజులరామారం బిఆర్ అంబేద్కర్ భవన్ వద్ద 2.7 సెంటీమీటర్లు
జూబ్లీహిల్స్ లోని శ్రీనగర్ కాలనీ లో 2.6 సెంటీమీటర్లు
గోషామహల్ పరిధిలోని ఎల్బి స్టేడియం గన్ ఫౌండ్రీ వద్ద 2.5
బేగంపేట్ లోని మొండా మార్కెట్ 3.1 సెంటీమీటర్లు
హైదరాబాదు నగరంలోని పిక్ ఇట్ హెల్త్ సెంటర్ వద్ద 3.9 సెంటీమీటర్లు
ఎల్బీనగర్ లోని టికెట్ హెల్త్ సెంటర్ వద్ద 3 సెంటీమీటర్లు
హైదరాబాదులోని గణాంక భవన్ వద్ద 3.5 సెంటీమీటర్లు
హైదరాబాద్లోని మొండా మార్కెట్లో 3.2 సెంటీమీటర్లు
నారాయణపేటలోని కొత్తపల్లిలో 3.6 సెంటీమీటర్లు
నారాయణపేట కోటకొండలో ఐదు సెంటీమీటర్లు
నారాయణపేటలో 3.3 సెంటీమీటర్లు
జోగులంబ గద్వాల్ లోని మల్దకల్ లో 3 సెంటీమీటర్లు
నారాయణపేటలోని దామరగిద్దలో 3.2 సెంటీమీటర్లు
జగిత్యాల్లోని కథలాపూర్ లో 3.2 సెంటీమీటర్లు 
జోగులాంబ గద్వాల్ జిల్లాలోని డ్యాగదొడ్డిలో 3.2 సెంటీమీటర్లు