'వర్క్‌‌– లైఫ్‌‌ బ్యాలెన్స్‌‌' కాన్సెప్ట్‌‌తో మౌస్‌‌ తయారు

'వర్క్‌‌– లైఫ్‌‌ బ్యాలెన్స్‌‌' కాన్సెప్ట్‌‌తో మౌస్‌‌ తయారు

పనిని ఎంతగా ప్రేమిస్తారో కుటుంబాన్ని కూడా అంతే ప్రేమించాలి అంటుంటారు. కానీ, కొందరు వర్క్‌‌ బిజీలో పడి ఇంటికి వెళ్లకపోవడం, ఫ్యామిలీకి సరిగా టైం కేటాయించకపోవడం చేస్తుంటారు. అలాంటి వాళ్లకోసం శామ్‌‌సంగ్‌‌ కంపెనీ ‘బ్యాలెన్స్‌‌ మౌస్‌‌’ని తీసుకొచ్చింది.

‘వర్క్‌‌– లైఫ్‌‌ బ్యాలెన్స్‌‌’ కాన్సెప్ట్‌‌లో ఈ మౌస్‌‌ని తయారుచేశారు.  దక్షిణ కొరియా, జపాన్‌‌లాంటి దేశాల్లో చాలామంది ఇంటికి వెళ్లకుండా ఎక్కువ టైం వర్క్‌‌ చేస్తూ ఆఫీస్‌‌లో ఉండిపోతున్నారు. దాంతో కుటుంబ సభ్యులు ఆఫీస్‌‌కి వచ్చి గొడవ చేస్తున్నారు. అంతేకాకుండా ఓవర్‌‌‌‌ టైం వర్క్ చేయడంవల్ల  ఉద్యోగుల ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే వాళ్ల ఉద్యోగులను కాపాడటంకోసం బ్యాలెన్స్‌‌ మౌస్‌‌ను తయారుచేశారు. ఇది చూడటానికి మౌస్‌‌లాగానే ఉంటుంది. కాకపోతే ఇందులో సెన్సర్స్‌‌ ఉంటాయి. అవి ఉద్యోగుల ఎక్స్‌‌ట్రా వర్కింగ్‌‌ అవర్స్‌‌ని తగ్గిస్తాయి. ఈ మౌస్‌‌ ఎలా పనిచేస్తుందంటే.. మౌస్‌‌ని బ్లూటూత్‌‌ సాయంతో కంప్యూటర్‌‌‌‌కి కనెక్ట్‌‌ చేసి ఆఫీస్‌‌ టైమింగ్‌‌ని సెట్‌‌ చేయాలి. ఆఫీస్‌‌ టైం అయిపోగానే మౌస్‌‌ పని చేయడం ఆగిపోతుంది. కాదని మౌస్‌‌ని పట్టుకొని పని చేయాలని ట్రై చేస్తే దాంట్లో ఉన్న సెన్సర్స్‌‌ యాక్టివేట్ అవుతాయి. మౌస్‌‌కి రెండు చెవులు, తోక, కాళ్లకి చక్రాలు వచ్చి పారిపోతుంది. వెంటపడి ఆపితే పైన పార్ట్‌‌నుంచి వేరై మూలల్లోకి వెళ్లి దాక్కుంటుంది. ఉద్యోగులు వెళ్లిపోగానే తిరిగొచ్చి మామూలు మౌస్‌‌లా మారిపోతుంది. ఈ కాన్సెప్ట్‌‌ను డెవలప్‌‌ చేసి త్వరలో అన్ని దేశాల్లో అందుబాటులోకి తెస్తామంటోంది శామ్‌‌సంగ్‌‌ కంపెనీ.