ఎంత ఘోరం..? అప్పుడే పుట్టిన మగ బిడ్డను బాలానగర్ వైన్స్ ముందు రోడ్డుపై వదిలేసి వెళ్లిన ఘటన

ఎంత ఘోరం..? అప్పుడే పుట్టిన మగ బిడ్డను బాలానగర్ వైన్స్ ముందు రోడ్డుపై వదిలేసి వెళ్లిన ఘటన

హైదరాబాద్: పిల్లలు లేక సంతానం కోసం కొందరు పరితపిస్తుంటే మరికొందరు మాత్రం నవ జాత శిశువుల విషయంలో అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు బాలానగర్లో నవజాత శిశువును రోడ్డుపై పడేసి వెళ్లిపోయారు. అప్పుడే పుట్టిన మగ బిడ్డను బాలానగర్ వైన్స్ ముందు రోడ్డుపై వదిలేసి వెళ్లిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కండువాలో చుట్టి, వదిలి వెళ్లినట్లు గుర్తించారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. నవజాత శిశువును PHC సెంటర్కి తరలించి చికిత్స అందించారు. శిశువు ఆరోగ్యంగా ఉందని వైద్యులు తెలిపారు. శిశు సంరక్షణ కేంద్రానికి తరలించారు.

సీసీ కెమెరాల ఆధారంగా ఈ ఘోరానికి పాల్పడిన వాళ్లను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంతానలేమితో బాధపడుతున్న వారి సంఖ్య భారతదేశంలో క్రమక్రమంగా పెరిగిపోతుండటం ఆందోళన కలిగించే విషయం. కానీ.. కొందరేమో ఇలా పుట్టిన బిడ్డలను ముళ్ల పొదల్లో, రోడ్ల పక్కన పడేసి కన్న బంధానికి విలువ లేకుండా చేస్తుండటం శోచనీయం. ఇలా పిల్లలు అక్కర్లేదనుకుంటే ‘ఊయల సెంటర్స్’లో వదిలేసి వెళ్లాలని, అలా వదిలేసి వెళ్లిన వాళ్ల వివరాలను గోప్యంగా ఉంచుతామని అధికారులు చెప్తున్నప్పటికీ కొందరి తీరు మారడం లేదు.