నేటి నుంచి హెల్త్ కేర్ ప్రొవైడర్ల పోస్టులకు దరఖాస్తులు

నేటి నుంచి హెల్త్ కేర్ ప్రొవైడర్ల పోస్టులకు దరఖాస్తులు
  • నేటి నుంచి హెల్త్ కేర్ ప్రొవైడర్ల పోస్టులకు దరఖాస్తులు 
  • ఎంబీబీఎస్, ఆయుర్వేద డాక్టర్లు, నర్సులకు అవకాశం
  • విద్యార్హతలో వచ్చిన మార్కుల ఆధారంగా పోస్టుల భర్తీ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పల్లె దవాఖాన్లలో 1,365 మిడ్‌‌‌‌ లెవల్ హెల్త్ కేర్ ప్రొవైడర్ (ఎంఎల్‌‌‌‌హెచ్‌‌‌‌పీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కాంట్రాక్ట్‌‌‌‌ బేసిస్‌‌‌‌పై ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్‌‌‌‌‌‌‌‌ కమిషనర్ శ్వేతా మహంతి మంగళవారం ఇచ్చిన ఆదేశాల మేరకు, అన్ని జిల్లాల కలెక్టర్లు బుధవారం నోటిఫికేషన్లు విడుదల చేశారు. ఎంబీబీఎస్ డాక్టర్లు, ఆయుర్వేద డాక్టర్లు (బీఏఎంఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), నర్సులు ఈ పోస్టులకు అర్హులుగా పేర్కొన్నారు. నియామకాల్లో ఎంబీబీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డాక్టర్లకు ఫస్ట్ ప్రయారిటీ, ఆయుర్వేద డాక్టర్లకు సెకండ్ ప్రయారిటీ, నర్సులకు థర్డ్ ప్రయారిటీ ఇచ్చి పోస్టులను భర్తీ చేయనున్నారు. గురువారం నుంచి ఈ నెల 7 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. 

డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసుల్లో దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. రాత పరీక్ష లేకుండా, విద్యార్హతలో వచ్చిన మార్కుల ఆధారంగానే మెరిట్ లిస్ట్‌‌‌‌ ప్రకటించి, వాటి ఆధారంగా ఉద్యోగాల ఎంపిక చేపట్టనున్నారు. అధికంగా సంగారెడ్డి జిల్లాలో 108 పోస్టులు, ఆదిలాబాద్‌‌‌‌ జిల్లాలో తక్కువగా 9 పోస్టులు ఉన్నాయి. మిగిలిన అన్ని జిల్లాల్లోనూ కనీసం 15 నుంచి వంద పోస్టుల వరకు ఖాళీలున్నాయి. గతేడాది 1,569 పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తే, 409 పోస్టులు మిగిలిపోయాయి. ఈ 409 పోస్టులు, కొత్తగా 956 పోస్టులు కలిపి 1,365 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు.

నిమ్స్‌‌‌‌లో 132 పోస్టులు..

నిమ్స్‌‌‌‌లో 132 అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి అనుమతినిస్తూ ఆర్థిక శాఖ జీవో ఇచ్చింది. డిపార్ట్‌‌‌‌మెంటల్ సెలక్షన్ కమిటీ ద్వారా వీటిని భర్తీ చేయాలని సూచించింది. స్టాఫ్ నర్స్‌‌‌‌ పోస్టులు, ఇతర పారామెడికల్ పోస్టులు కూడా పెద్ద సంఖ్యలో ఖాళీగా ఉన్నప్పటికీ వాటి భర్తీపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ధర్మపురి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌‌‌‌‌‌‌‌లో ప్రస్తుతం 30 బెడ్ల కెపాసిటీ ఉండగా, అదనంగా 20 బెడ్లను ఏర్పాటు చేసుకునేందుకు పర్మిషన్ ఇస్తూ సర్కార్ మరో జీవో ఇచ్చింది.