లీడ్స్: విమెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మడమ గాయం కారణంగా యంగ్ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ మెగా టోర్నీకి దూరమైంది. ఆమె స్థానంలో లెగ్ స్పిన్నర్ ప్రేమా రావత్‌ను జట్టులోకి తీసుకున్నారు. రావత్ ఇప్పటి వరకు ఒక్క ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా ఆడలేదు.
నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పవర్‌ప్లే చివరి ఓవర్‌లో బంతిని ఆపబోయిన శ్రేయాంక కుడి కాలు మడమ తిరగబడటంతో గ్రౌండ్‌లోనే కుప్పకూలింది. నడవడానికి కూడా వీలుపడకపోవడంతో స్ట్రెచర్‌పై గ్రౌండ్ వెలుపలికి తీసుకెళ్లారు.
కేవలం ఒక్క బంతి మాత్రమే వేసిన శ్రేయాంక.. ఆ తర్వాత మ్యాచ్‌లో బౌలింగ్ చేయలేకపోయింది. డబ్ల్యూపీఎల్‌లో రావత్ ఆర్సీబీ తరఫున ఆరు మ్యాచ్‌లు ఆడింది.
