అప్పుల బాధతో ప్రాణం తీసుకున్న ప్రైవేట్ టీచర్

అప్పుల బాధతో ప్రాణం తీసుకున్న ప్రైవేట్  టీచర్

ఆర్థిక ఇబ్బందులతో ప్రైవేట్ స్కూల్ టీచర్ ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన నల్గొండ జిల్లా మునుగోడు మండలం గంగొరిగూడెంలో ఆదివారం జరిగింది. గ్రామస్తులు, పోలీసుల వివరాల ప్రకారం.. గంగొరిగూడెంకు చెందిన మర్రి వెంకట్(30) పీజీ పూర్తి చేశారు. సర్కారు ఉద్యోగం రాకపోవడంతో నార్కట్ పల్లిలోని ఓ ప్రైవేట్ స్కూల్ లో కొన్నేండ్లుగా టీచర్ గా చేస్తున్నారు. కరోనా ఎఫెక్ట్ తో స్కూళ్లు మూతపడటంతో జీతాలు రాక ఆర్థిక ఇబ్బందులను మొదలయ్యాయి. తనపై ఆధారపడిన తల్లిదండ్రులను పోషించేందుకు నాలుగెకరాలు కౌలుకు తీసుకొని పత్తి పంట సాగు చేశారు. కానీ ఈ ఏడాది కురిసిన వరుస వర్షా లతో పత్తి పంట ఎర్రబారి దిగుబడి రాకుండా పోయింది. కొద్ది రోజులుగా పంట సాగుకు చేసిన అప్పులు ఎలా తీర్చాలనే ఆందోళనతో దిగులుగా గ్రామంలో తిరుగుతున్నాడు. ఆదివారంతెల్లవారుజామున పొలానికి వెళ్లి పురుగుల మందు తాగాడు. విషయం తెలిసి గ్రామస్తులు, కుటుంబ సభ్యులు వెళ్లేసరికి మృతిచెందాడు. మృతుడి తండ్రి శంకరయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

డీకే శివకుమార్ ఇంట్లో సీబీఐ సోదాలు

భారత్ లో 66 లక్షలు దాటిన కేసులు

తెలంగాణలో 2 లక్షలు దాటిన కేసులు