కెమెరాలకు చిక్కిన వింత జంతువు..ఫేస్ బుక్ లో పోస్ట్

కెమెరాలకు చిక్కిన వింత జంతువు..ఫేస్ బుక్ లో పోస్ట్

వాషింగ్టన్ : అమెరికాలోని టెక్సాస్‌‌‌‌లో ఉన్న బెంట్‌‌‌‌సెన్ -రియో గ్రాండే వ్యాలీ స్టేట్ పార్కులో ఓ వింత జంతువు కనిపించింది. ఈ జంతువు రాత్రిపూట కెమెరాలకు చిక్కింది. దాంతో అధికారులు ఈ జంతువు ఏమై ఉంటుందని ఆలోచించడం మొదలుపెట్టారు. దాన్ని గుర్తించడం వారివల్ల కాకపోవడంతో గతవారం ఫేస్‌‌‌‌బుక్‌‌‌‌లో ఆ జంతువు పిక్ ను పోస్ట్ చేశారు. " ఈ జంతువును గుర్తించడానికి మేము తలలు పట్టుకుంటున్నాం. ఇది కొత్త జాతి జంతువా ?  లేదా మారువేషంలో ఉన్న పార్క్ రేంజరా ? తెలియడం లేదు. దీన్ని చూడటం చాలా థ్రిల్లింగ్‌‌‌‌గా ఉంది. ఈ జంతువు పోట్టిగా ఉండటంతోపాటు నాలుగు కాళ్లు, వెంట్రుకలు ఉన్నాయి.

పార్కులో ఉన్న కెమెరాకు రాత్రివేళ చిక్కింది. ఇదేమిటో మీకు తెలిస్తే కాస్త చెప్పండి. " అని పార్కు అధికారులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనికి నెటిజన్ల నుంచి భారీ స్పందన వస్తోంది.  ఇది ఎలుగుబంటిలాగా ఉందని..ఒక వేళ అది ఎలుగుబంటి కాకపోతే, మారువేషంలో ఉన్న పార్క్ రేంజరని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు. టెక్సాస్ భారీ ఎలుక అని మరొకరన్నారు. అది బీవర్ అని ఒకరు, వుల్వరైన్ అని మరొకరు, కాపిబారా అని ఇంకొకరు ఇలా వివిధ రకాలుగా నెటిజన్లు సమాధానం చెప్పారు.