బీదర్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

బీదర్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

కర్ణాటకలోని బీదర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కు, ఆటో రిక్షా ఢీ కొట్టుకొవడంతో ఏడుగురు మహిళలు అక్కడిక్కక్కడే మృతిచెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా బుడమనహళ్లి గ్రామానికి చెందిన కూలీలు. పని ముగించుకుని తమ ఇండ్లకు తిరిగి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

గాయపడిన వారిని వెంటనే బీదర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో రెండు వాహనాల డ్రైవర్లు కూడా ఉన్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై బెమల్‌ఖేడా పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయింది. దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.