ఫకీర్ వేషంలో వచ్చి.. సైలెంట్ గా స్మార్ట్ ఫోన్ ఎత్తుకెళ్లాడు

ఫకీర్ వేషంలో వచ్చి.. సైలెంట్ గా స్మార్ట్ ఫోన్ ఎత్తుకెళ్లాడు

హైదరాబాద్: చోరీ చేసేటప్పుడు దొంగలు వేసే ప్లాన్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాత్రి సమయాల్లో అందరు పడుకున్నాక రకరకాల గెటప్ లతో వచ్చి బురిడీ కొట్టింస్తుంటారు. అయితే ఓ దొంగ మాత్రం పట్టపగలే.. అందరూ ఇంట్లో ఉన్నా.. సైలెంట్ గా ఇంట్లోకి వచ్చి స్మార్ట్ ఫోన్ చోరీ చేశాడు. సీసీటీవీ ద్వారా బయటపడ్డ ఈ గురువారం హైదరాబాద్ లో జరిగింది.

వివరాలు: ఎస్సార్‌ నగర్ పీఎస్ పరిధిలోని కల్యాణ్ నగర్ వెంచర్-3లోని ఓ ఇంటిలోకి ఫకీర్ వేషంలో వచ్చిన దొంగ మొబైల్ చోరీ చేశాడు. ఇంటి హాల్లో ఎవరూ లేరని గ్రహించిన దొంగ.. టేబుల్‌ పై ఉన్న సెల్‌ ఫోన్‌ ను ఎత్తుకెళ్లాడు. పక్కన కిచెన్‌ లో ఉన్న వాళ్లు ఈ చోరీని గమనించలేదు. సైలెంట్‌ గా వచ్చిన దొంగ ఖరీదైన సెల్‌ ఫోన్‌ ను జేబులో వేసుకుని వెళ్లిపోయాడు. కాసేపు తర్వాత సెల్‌ ఫోన్ కనిపించకపోవడంతో ఇంట్లో వాళ్లంతా వెతికారు. ఎక్కడా కనిపించలేదు. ఇంట్లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్‌ ను చెక్ చేశారు.

సినిమాలో చూపించినట్టుగానే పక్క గదిలో మనుషులు ఉన్నా.. సైలెంట్‌ గా దొంగ తన పని తాను చేసుకుని వెళ్లిపోవడం చూసి కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు. అందుకే అనుమానాస్పద మనుషుల పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపారు పోలీసులు. ఇంటి డోర్స ఎప్పుడూ మూసి పెట్టుకోవాలని.. గుర్తు తెలియని వ్యక్తులు వస్తే ఇంటి బయటి నుంచే మాట్లాడి పంపాలని సూచించారు. బెగ్గర్, మార్కెటింగ్, పలు  బిజినెస్ లు అంటూ వచ్చేవారిపట్ల జాగ్రత్తగా ఉండాలంటున్నారు. లేకుంటే ఇటాంటి సంఘటనలు చూడాల్సి వస్తుందని తెలిపారు ఎస్సార్ నగర్ పోలీసులు.