కాల్ చేసుకుంటానని.. మొబైల్ ఎత్తుకెళ్లిండు.. Rs.62వేలు దోపిడి..

కాల్ చేసుకుంటానని.. మొబైల్ ఎత్తుకెళ్లిండు.. Rs.62వేలు దోపిడి..
  •     ఆపై అకౌంట్​లోని డబ్బులు విత్​డ్రా

జూబ్లీహిల్స్, వెలుగు:  కాల్​ చేసుకుంటానని ఓ వ్యక్తి ఫోన్ కొట్టేసిన దొంగ బాధితుడిని  అకౌంట్​లోని డబ్బులు కూడా  విత్ డ్రా చేశాడు. బిహార్ రాష్ట్రానికి చెందిన విష్ణుకుమార్(20) మధురానగర్ లోని ఓ హోటల్ లో మూడేండ్లుగా పనిచేస్తున్నాడు. ఈ నెల 18న గుర్తుతెలియని వ్యక్తి మాస్క్ పెట్టుకుని ఒక ఫోన్ చేసుకుంటానని అతని మొబైల్ తీసుకున్నాడు. అనంతరం కాల్ మాట్లాడుతున్నట్లు నటించి పరారయ్యాడు. అనంతరం తన అకౌంట్లోని  రూ.62 వేల నగదును విత్ డ్రా చేసినట్లు బాధితుడు జూబ్లీహిల్స్​ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.