27% వృద్ధి సాధించిన బెన్క్యూ

27% వృద్ధి సాధించిన బెన్క్యూ

హైదరాబాద్​, వెలుగు: ప్రీమియం డిస్​ప్లే సొల్యూషన్లకు డిమాండ్ భారీగా పెరగడంతో  తెలంగాణలో గత ఏడాది 27 శాతం వృద్ధి సాధించినట్టు తైవాన్​కన్జూమర్ ​ఎలక్ట్రానిక్స్​ కంపెనీ బెన్​క్యూ ప్రకటించింది. కంపెనీ సీనియర్ ​ఎగ్జిక్యూటివ్​ రాజీవ్​ సింగ్​హైదరాబాద్​లో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎల్‌‌‌‌‌‌‌‌సీడీ మానిటర్ల అమ్మకాల్లో తెలంగాణ మార్కెట్​నుంచి తమకు ఎనిమిది శాతం వాటా ఉందని చెప్పారు. 

దక్షిణ భారతదేశం మొత్తం రెవెన్యూలో ఈ రాష్ట్రం 19 శాతం వాటాను అందిస్తూ, కంపెనీ వృద్ధికి కీలక ఇంజిన్‌‌‌‌‌‌‌‌గా మారిందని వెల్లడించారు. డిజిటల్ విద్యను ప్రోత్సహించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వ స్మార్ట్ ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్ కింద 8,700కుపైగా ఇంటరాక్టివ్​ డిస్​ప్లే మానిటర్లను అమర్చామని ప్రకటించారు. తమకు రాష్ట్రవ్యాప్తంగా 100 కంటే ఎక్కువ మంది చానెల్ పార్టనర్లు, ఎనిమిది సర్వీస్ సెంటర్లు ఉన్నాయని సింగ్ ​పేర్కొన్నారు.