వికారాబాద్, వెలుగు: అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తన కుమార్తె, వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం అనన్యతో కలిసి షిర్డీ సాయినాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సోమవారం రాత్రి ధూప హారతిలో పాల్గొన్న ఆయన.. మంగళవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనం ద్వారా బాబా మహా సమాధిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న సభాపతికి సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం ట్రస్ట్ కార్యాలయంలో వారిని శాలువాతో సన్మానించి, ప్రసాదాలను అందజేశారు.
