వికారాబాద్, వెలుగు: శాసన మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్‌రెడ్డి గన్‌మెన్ విజయ్‌కుమార్ గుండెపోటుతో మృతిచెందారు. మంగళవారం ఉదయం వికారాబాద్ పట్టణంలోని రామయ్యగూడలోని తన నివాసంలో కన్నుమూశారు. పట్నం మహేందర్‌రెడ్డి అక్కడికి వెళ్లి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
విజయ్‌కుమార్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అర్థ సుధాకర్‌రెడ్డి, మార్కెట్ మాజీ చైర్మన్ రామచంద్రారెడ్డి, నాయకులు చిగుళ్లపల్లి రమేశ్‌కుమార్, ముక్తార్ షరీఫ్, నరోత్తం రెడ్డి, పన్నాల సాయిరెడ్డి, భగవాన్, కేశవరావు తదితరులు పాల్గొన్నారు.
