
- మూడు రోజుల పాటు నియోజకవర్గాల్లో పర్యటన
హైదరాబాద్, వెలుగు: లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ అనుకున్న సీట్లను గెలవలేకపోవడంపై కారణాలను తెలుసుకునేందుకు హైకమాండ్ ముగ్గురు పార్టీ సీనియర్ నేతలతో నియమించిన కమిటీ ఈ నెల 10న రాష్ట్రానికి రానుంది. ఈ కమిటీలో సభ్యులైన పీజే కురియన్, రకిబుల్ హుస్సేన్, పరగత్ సింగ్ రాష్ట్రంలో 3 రోజుల పాటు పర్యటించనున్నారు.
.కాంగ్రెస్ ఓడిపోయిన లోక్ సభ నియోజకవర్గాల పరిధిలో ఈ కమిటీ పర్యటించనుంది. పార్టీ తక్కువ సీట్లను సాధించడానికి గల కారణాలను క్యాడర్ నుంచి అభిప్రాయాలను సేకరించనుంది. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్కు తక్కువ ఎంపీ సీట్లు వచ్చిన రాష్ట్రాలకు త్రీ మెన్ కమిటీలను హైకమాండ్ నియమించింది.