ఏం తిందామన్నా భయం భయం: చిప్స్ ప్యాకెట్‪లో కప్ప కళేబరం

ఏం తిందామన్నా భయం భయం: చిప్స్ ప్యాకెట్‪లో కప్ప కళేబరం

ఆహార పదార్థాలు కలుషితమైవుతున్న వార్తలు వారం రోజుల్లోనే 5 బయటపడ్డాయి. అసలు ఏం జరుగుతుందని జనం ఆశ్చర్యపోతున్నారు. ఐస్క్రీంలో జెర్రీ, మనిషి వేలు, ఆర్డర్ చేసిన ఫుడ్ లో బ్లేడ్, చాక్లెట్ సిరప్ లో కుళ్లిపోయిన ఎలుక కళేబరం ఇలా వారం రోజుల్లోనే దాదాపు ఆరు ఘటనలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీటిని ప్రభుత్వాలు సీరియస్ గా తీసుకోవడం లేదు. ఇలాంటి పొరపాట్లు మనకు ఎన్ని జరుగుతున్నాయో అవి ప్రజలు భయాంధోళనలకు గురవుతున్నారు.

బుధవారం (జూన్ 19) ఒక్కరోజే రెండు ఫుడ్ అడట్ల్రేషన్ వార్తలు బయటకు వచ్చాయి. చాక్లెట్ సిరప్ లో చనిపోయిన ఎలుక రాగా.. అది ఇన్ స్టాగ్రామ్ లో బాగా వైరల్ అయ్యింది. గుజరాత్ లోని జామ్ నగర్లో  నివసిస్తున్న జాస్మిన్ పటేల్ అనే మహిళ జూన్ 18న ఓ దుకాణంలో చిప్స్ ప్యాకెట్ కొన్నది. దాంట్లో చనిపోయిన కప్ప కళేబరం దర్శనమిచ్చింది. దీంతో ఒక్కసారిగా వారు కంగుతిన్నారు. విషయం బయటకు తెలియగానే పౌరసరఫరాల అధికారులు ఆ దుకాణంలో ఉన్న చిప్స్ ప్యాకెట్లు అన్ని స్వాధీనం చేసుకొని టెస్టుల కోసం ల్యాబ్ కు పంపారు.