తీగల చెట్టు.. పొంచి ఉన్న ప్రమాదం

తీగల చెట్టు.. పొంచి ఉన్న ప్రమాదం

వానాకాలం కావడంతో  ట్రాన్స్​ఫార్మర్ కు తీగల చెట్టు అల్లుకుపోయింది. దాని పక్కనే కాలనీ పార్క్​ ఉంది.  రోజూ పిల్లలు, పెద్దలు అందులోకి వెళ్తుంటారు.  ట్రాన్స్ ఫార్మర్ తో ప్రమాదం పొంచి ఉండగా..  ఎప్పుడైనా విద్యుత్​ షాక్​కు గురయ్యే అవకాశం ఉంది . రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్​మండలం ఉప్పర్​పల్లి వెంకటేశ్వర ఎన్​క్లేవ్ కాలనీలో ఇలాంటి పరిస్థితి చాలా రోజులుగా ఉంటుంది. 

దీనిపై స్థానిక రాజేంద్రనగర్ ​విద్యుత్ ఏఈకి తెలపడమే కాకుండా కాలనీ కమిటీ వినతిపత్రం కూడా అందించింది. అయినా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆ ట్రాన్స్ ఫార్మర్ తో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుం దోనని కాలనీవాసుల్లో భయాందోళన నెలకొంది. ఇప్పటికైనా విద్యుత్ అధికారులు స్పందించి వెంటనే అల్లుకుపోయిన చెట్టును తొలగించాలని కోరుతున్నారు.  మరోసారి చెట్లు పెరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరముందని పేర్కొంటున్నారు.