
కుత్బుల్లాపూర్ లో దారుణం జరిగింది. నగల కోసం మహిళను హత్య చేశారు కిరాతకులు. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధి మల్లంపేటలోని ఓ అపార్ట్ మెంట్లో శారద(50)అనే మహిళను హత్య చేసి, ఒంటిపై ఉన్న బంగారం దోచుకెళ్లారు గుర్తు తెలియని వ్యక్తులు. ఈ ఘటన సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి. సెప్టెంబర్ 23న రాత్రి ఈ ఘటన జరిగింది. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.