
మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధిలో బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్లలో అపశృతి జరిగింది. స్థానిక కేసీఆర్ మార్కెట్ పక్కన ఉన్న స్థలంలో బతుకమ్మ ఉత్సవాలకు ఎమ్మెల్సీ కవిత హాజరవుతుండడంతో శనివారం సాయంత్రం లోకల్ టీఆర్‌ఎస్ నేతలు బ్యానర్ కడుతుండగా విద్యుత్ తీగలు తగిలాయి. దీంతో బ్యాన్ కడుతున్న యువకుడు రాజు (19)కు కరెంట్ షాక్ తగలి మరణించాడు. ఈ ఘటనలో మరొకరికి గాయాలయ్యాయి.