స్కూల్‎కు వెళ్తున్న మైనర్‎ను ఎత్తుకెళ్లి గ్యాంగ్‎రేప్

V6 Velugu Posted on Oct 10, 2021

కర్ణాటకలో దారుణ ఘటన వెలుగుచూసింది. మైనర్ బాలికను కారులో తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దక్షిణ కన్నడ జిల్లాలోని బంట్వాల్ తాలూకాలోని అమతడి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బాలిక పాఠశాలకు వెళ్తుండగా.. తెలిసిన వ్యక్తి స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తానని చెప్పి కారులో ఎక్కించుకున్నాడు. అక్కడి నుంచి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం బాధితురాలిని బ్రహ్మరకూట్లలో వదిలివెళ్లారు. బాధితురాలి ఘటనను తన తల్లిదండ్రులకు చెప్పడంతో.. వారు బంట్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. బాధితురాలి వాంగ్మూలాన్ని రికార్డు చేసి.. మంగుళూరులోని మహిళా గోస్చెన్ ఆసుపత్రికి తరలించారు. సీసీ ఫుటేజీ ద్వారా నిందితులను గుర్తించి ఇద్దరిని అరెస్ట్ చేశారు. మరో ముగ్గురి కోసం గాలింపు చేపట్టారు. నిందితులపై ఐపీసీ మరియు పోక్సో చట్టం కింద గ్యాంగ్ రేప్ కేసు నమోదు చేశారు.
 
For More News..

పండుగ బాదుడు.. చార్జీలు పెంచేసిన రైల్వే, ఆర్టీసీ, ట్రావెల్స్

Tagged karnataka, GANG RAPE, minor girl rape, Mangalore, Dakshina Kannada district, Bantwal rape

Latest Videos

Subscribe Now

More News