
ఏ క్రీడల్లో అయినా..ఉమెన్స్ విభాగం...మెన్స్ విభాగం అని సెపరేట్గా ఉంటాయి. పురుషులు.. మెన్స్ విభాగంలో..మహిళలు ఉమెన్స్ విభాగంలోనే ఆడాల్సి ఉంటుంది. కొన్ని క్రీడల్లో ట్రాన్స్ జెండర్స్ ఉమెన్స్ విభాగాల్లోనూ పాల్గొంటుంటారు. అయితే వరల్డ్ అథ్టెటిక్స్ అసోషియేషన్..ఉమెన్స్ క్రీడల్లో ట్రాన్స్ జెండర్లు పోటీ పడొద్దని ఇటీవలే నిర్ణయం తీసుకుంది. అయితే కెన్యాలో జరిగిన మహిళల చెస్ టోర్నీ ఓ యువకుడు పాల్గొన్నాడు. అదెలాగో చదివేయండి..
వివరాల్లోకి వెళ్తే..
స్టాన్లీ ఒమొండీ అనే యువకుడు(25) చెస్ ప్లేయర్. అతడు కెన్యాలో జరిగిన ఓపెన్ చెస్ ఛాంపియన్‌షిప్ మహిళల విభాగంలో పాల్గొన్నాడు. హిజాబ్ ధరించి ఈ టోర్నీలో ఆడాడు. అంతేకాదు మిల్లిసెంట్ అవర్‌గా టోర్నీలో పేరును రిజిస్టర్ చేసుకున్నాడు. జా నాలుగు రౌండ్ల వరకు సూపర్ గా ఆడాడు. ఇందులో రెండు రౌండ్లలోనూ గెలిచాడు. అయితే గెలిచిన తర్వాత అతను ఒక్క మాట కూడా మాట్లాడకపోవడంతో నిర్వాహకులకు అనుమానం వచ్చింది.
బయటపడిన బండారం..
నాలుగో రౌండ్ అయిపోయిన తర్వాత స్టాన్లీ ఒమొండీని ప్రత్యేక గదికి తీసుకెళ్లి విచారించారు. విచారణలో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. దీంతో నిర్వాహకులు స్టాన్లీని టోర్నీ నుంచి బహిష్కరించారు. ఘరానా మోసానికి పాల్పడ్డ యువకుడిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని నిర్వాహకులు తెలిపారు. అంతేకాదు నాల్గు రౌండ్లలో స్టాన్లీ సాధించిన పాయింట్లను ప్రత్యర్థుల ఖాతాలో చేర్చారు.
ఎందుకు పాల్గొన్నాడో తెలుసా..
హిజాబ్ ధరించి చెస్ టోర్నీలో ఎందుకు పాల్గొనాల్సి వచ్చిందో వెల్లడించాడు స్టాన్లీ. కేవలం ప్రైజ్ మనీ కోసమే చెస్ టోర్నీలో ఆడానని చెప్పుకొచ్చాడు. తనకున్న ఆర్థిక అవసరాల కారణంగానే మహిళల టోర్నీలో మారువేషంలో ఆడానన్నాడు. తన పొరపాటుకు చింతిస్తున్నానని.... తనకు ఎలాంటి శిక్ష విధించినా భరిస్తానని స్టాన్లీ పేర్కొన్నాడు.