
యువతిని వేధించిన ఓ యువకుడిని దేహశుద్ది చేశారు ఆమె కుటుంబ సభ్యులు. మా అమ్మాయినే వేధిస్తావా అంటూ నడిరోడ్డుపై యువకుడిని పట్టుకుని చితక్కొట్టారు తల్లిదండ్రులు. ఈ ఘటన జూన్ 4న వరంగల్ జిల్లాలో జరిగింది .
వరంగల్ లోని భద్రకాళి టెంపుల్ దగ్గర ఓ యువకుడి పై యువతి కుటుంబ సభ్యుల దాడి చేశారు. తమ కూతురికి ఫోన్ చేసి వేధిస్తున్నాడంటూ భద్రకాళి గుడి దగ్గర యువకుడిని పట్టుకున్నారు యువతి కుటుంబ సభ్యులు. యువకుడిపై పిడి గుద్దులతో దాడి చేశారు. అయితే ఫోన్ చేసి వేధించలేదని యువకుడి స్నేహితులు చెబుతున్నారు. ఎంత చెప్పినా వినకుండా యువకుడిని కొట్టారు.
ఘటనా స్థలానికి వచ్చిన మాట్వాడ పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే ఆ యువకుడు యువతిని వేధించాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.