మెడను కోసేసిన చైనా మాంజా.. 19 కుట్లేసి కాపాడిన డాక్టర్లు

మెడను కోసేసిన  చైనా మాంజా.. 19 కుట్లేసి కాపాడిన డాక్టర్లు

కీసర, వెలుగు: చైనా మాంజా మెడకు చుట్టుకోవడంతో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. మేడ్చల్ జిల్లా కీసర మల్లికార్జున నగర్​కాలనీకి చెందిన జశ్వంత్​రెడ్డి బీటెక్​చదువుతున్నాడు. శుక్రవారం సాయంత్రం కీసర ఎస్సీ కాలనీ పక్కనున్న తన పొలానికి బైక్ పై వెళ్తున్నాడు. ఆ టైంలో కొందరు పతంగులు ఎగురవేస్తున్నారు. ఒక పతంగికి ఉన్న చైనా మాంజా జశ్వంత్​ మెడకు చుట్టుకుంది. దాన్ని గమనించకుండా కొంచం దూరం ముందుకు పోవడంతో మెడను పావు శాతం కోసేసింది. దీంతో బైక్  పై నుంచి పడిపోయిన జశ్వంత్​ను  స్థానికులు హాస్పిటల్​కు తరలించారు. డాక్టర్లు 19 కుట్లు వేసి ట్రీట్​మెంట్​ చేశారు. బాధితుడి తండ్రి సుధాకర్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు కీసర సీఐ ఆర్కేపల్లి ఆంజనేయులు తెలిపారు.