చక్రాల బండిపై కూర్చున్న దివ్యాంగుడికి గాంధీ వేషధారణలో ఉన్న ఓ యువకుడు సాయం చేశాడు. శుక్రవారం నగరంలోని ఐమ్యాక్స్ నుంచి నెక్లెస్ రోడ్ వైపు వెళుతుండగా తన కర్ర పట్టుకోమని చెప్పి గమ్యస్థానానికి చేర్చాడు. మనిషికి తోటి మనిషే సాయం అనే దానికి ఈ దృశ్యమే నిదర్శనం. – హైదరాబాద్, వెలుగు

