శ్రీరామనవమి రోజు ఆచార్య ఫస్ట్ లుక్

శ్రీరామనవమి రోజు ఆచార్య ఫస్ట్ లుక్

ఉగాది నాడు సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చారు చిరంజీవి. ఓవైపు సినీ కార్మికులను ఆదుకునేందుకు ఏర్పాటు చేసిన ‘సిసిసి (కరోనా క్రైసిస్ చారిటీ) మనకోసం సంస్థకి ఛైర్మన్ గా వ్యవహరిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ నితిన్ లాంటి యువ హీరోలకి బర్త్ డే విషెస్ చెప్పి ప్రోత్సహిస్తున్నారు. అయితే తన సినిమా ‘ఆచార్య’ గురించి ఆయన ఎప్పుడెప్పుడు సోషల్ మీడియాలో అప్ డేట్ ఇస్తారా అని ఎదురుచూస్తున్నారు అభిమానులు. అతి త్వరలో ఆయన నుండి ‘ఆచార్య’ ఫస్ట్ లుక్ కి సంబంధించిన అప్డేట్ రానుందట. ‘శ్రీరామ నవమి’ సందర్భంగా ఏప్రిల్ 2న టైటిల్ తో కూడిన ఫస్ట్ లుక్ ని విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. ఉగాదికే ఫస్ట్ లుక్ ని ఆశించిన అభిమానులకు కొంత నిరాశ ఎదురైంది. చిరు సోషల్ మీడియా ఎంట్రీ ఆ లోటును భర్తీ చేసింది. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ స్పాట్ నుండి మెగాస్టార్ లుక్ కి సంబంధించి కొన్ని ఫొటోలు లీక్ అయ్యాయి. మరోవైపు అప్పటి వరకూ ప్రచారంలో మాత్రమే ఉన్న ‘ఆచార్య’ టైటిల్ ని ‘ఓ పిట్టకథ’ ప్రీ రిలీజ్
వేడుకలో రివీల్ చేసేశారు మెగాస్టార్. దీంతో చిరు లుక్, టైటిల్ పై ఓ క్లారిటీ వచ్చేసింది. అయితే ఫస్ట్ లుక్ లో తమ అభిమాన హీరో ఎలా కనిపించనున్నారనే ఇంటరెస్ట్ మాత్రం అభిమానుల్లో చాలానే ఉంది. మరి కమర్షియల్ కంటెంట్ కి సోషల్ మెసేజ్ ని మిక్స్ చేసే కొరటాల.. చిరంజీవిని ఎలా చూపించబోతున్నాడో!

For More News..

సీఎం రిలీఫ్ ఫండ్ కు సర్పంచ్ల విరాళం

ప్రభుత్వోద్యోగుల్లో ఎవరెవరికి ఎంత జీతం కోత?

ఇక్కడున్న పక్క రాష్ట్రాల వారికీ బియ్యం, నగదు

మూడు రోజుల్లోనే 6 లక్షలు దాటిన కరోనా కాల్స్

కరోనా విరాళాలను వదలని సైబర్ దొంగలు