ఢిల్లీ మేయర్​గా షెల్లీ ఒబెరాయ్

ఢిల్లీ మేయర్​గా షెల్లీ ఒబెరాయ్

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్‌ అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. మేయర్ అభ్యర్థిగా షెల్లీ ఒబెరాయ్, డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా ఆప్ ఎమ్మెల్యే షోయబ్ ఇక్బాల్ కుమారుడు ఆలే మొహమ్మద్ ఇక్బాల్​ను ఎంపిక చేసింది. ఆప్ సీనియర్ నేత పంకజ్ గుప్తా శుక్రవారం మీడియా సమావేశంలో వారి పేర్లను ప్రకటించారు. డిసెంబర్ 7న జరిగిన ఎంసీడీ ఎన్నికల్లో ఆమ్​ ఆద్మీ పార్టీ.. 134 స్థానాల్లో గెలుపొంది తొలిసారి మేయర్​ పీఠాన్ని కైవసం చేసుకుంది. అలాగే, ఎంసీడీ ఎన్నికల్లో ఫస్ట్​టైం పోటీచేసి విజయం సాధించిన షెల్లీ ఒబెరాయ్ మేయర్ పోస్ట్​ను దక్కించుకున్నారు. 

ఢిల్లీ అభివృద్ధే లక్ష్యం: షెల్లీ ఒబెరాయ్

ఢిల్లీ అభివృద్ధికి కౌన్సిలర్లందరితో కలిసి పనిచేయడమే తమ లక్ష్యమని షెల్లీ ఒబెరాయ్ తెలిపారు. ఇప్పటికే కౌన్సిలర్లు వార్డుల్లో పనులు ప్రారంభించారన్నారు. పరిశుభ్రత, నగరంలో చెత్త సమస్యను పరిష్కరించడంపై మెయిన్​ ఫోకస్​ ఉంటుందన్నారు. 39 ఏండ్ల ఒబెరాయ్.. ఢిల్లీ బీజేపీ మాజీ అధ్యక్షుడు ఆదేశ్ గుప్తా సొంత గడ్డగా అయిన ఈస్ట్​ పటేల్ నగర్ వార్డు నుంచి గెలిచారు.