యుద్ధం ఆపేందుకు జూన్ వరకు ట్రంప్ గడువు : ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ

యుద్ధం ఆపేందుకు జూన్ వరకు ట్రంప్ గడువు : ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ
  • ఉక్రెయిన్ ప్రెసిడెంట్​ జెలెన్ స్కీ

కీవ్: రష్యా, ఉక్రెయిన్  మధ్య గత నాలుగేళ్లుగా జరుగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు జూన్ లోపు ఒక నిర్ణయానికి రావాలని అమెరికా డెడ్ లైన్  పెట్టిందని ఉక్రెయిన్  అధ్యక్షుడు వోలోదిమిర్  జెలెన్ స్కీ తెలిపారు. కీవ్  లో శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడారు. జూన్ లోపు ఏదో ఒక నిర్ణయం తీసుకోకుంటే రెండు దేశాలపైనా మరింత ఒత్తిడి చేస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్  ట్రంప్  స్పష్టం చేశారని ఆయన వెల్లడించారు. ‘‘యుద్ధం ముగించాలని  రెండు పార్టీలకు (ఉక్రెయిన్, రష్యా) అమెరికా ప్రతిపాదనలు చేస్తున్నది.

ఈ విషయంలో ఎప్పుడు ఏం చేయాలనే దానిపై అమెరికాకు స్పష్టత ఉంది. యుద్ధాన్ని ఆపేసేందుకు అవసరమైన అన్ని వ్యవహారాలు జూన్ లోపే పూర్తి కావాలని భావిస్తోంది. రష్యా– ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేయడానికి అమెరికా సిద్ధంగా ఉంది’’ అని జెలెన్ స్కీ చెప్పారు. మరోవైపు, అమెరికా, రష్యా, ఉక్రెయిన్  మధ్య త్రైపాక్షిక చర్చల కోసమూ 
యూఎస్  ప్రతిపాదనలు చేసింది. అమెరికాలోని మయామీలో ఆ చర్చలు జరుగుతాయని అనుకొంటున్నా” అని జెలెన్ స్కీ పేర్కొన్నారు.