తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్‌గా మెప్పించిన సాయిపల్లవి.. బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సినిమా ‘ఏక్ దిన్’ (Ek Din). ఆమిర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ ఇందులో హీరోగా నటిస్తున్నాడు. మే 1న ఈ చిత్రం విడుదల కాబోతోంది. హిందీతో పాటు తెలుగులోనూ ఈ సినిమా విడుదల కాబోతోంది. తెలుగులో ‘ఒకరోజు’ అనే టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా ఆదివారం (ఏప్రిల్ 26న) రాత్రి జరిగిన స్పెషల్ ఈవెంట్‌లో ఆమిర్ ఖాన్ ఎమోషనల్ అయ్యారు. తన కొడుకు జునైద్ నటనకు ఫిదా అవుతూ కన్నీరు పెట్టుకున్నారు. ఇదే సమయంలో ఆమిర్ పక్కనే కూర్చున్న సాయి పల్లవి ఆయనను ఓదారుస్తూ కనిపించింది. ఆ వెంటనే ఆమీర్ తన కన్నీళ్లను తుడుచుకుంటూ చిరునవ్వు చిందించారు. అలోమోస్ట్ ఆ ఈవెంట్లో ఉన్న ప్రతిఒక్కరి కళ్లు చెమ్మగిల్లాయి. సాయి పల్లవి, జునైద్ తమ నటనతో అందరినీ ఏడ్పించేశారని టాక్.
అనంతరం, ఆమిర్ స్టేజ్‌పైకి వెళ్లి సినిమాలోని ఒక పాటను కూడా పాడారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా సాయి పల్లవిని ప్రశంసిస్తూ, “మన దేశంలో ప్రస్తుతం ఉన్న ఉత్తమ నటి” తను అని అన్నారు. కుమారుడు జునైద్ గురించి సరదాగా మాట్లాడుతూ, “జునైద్ కూడా బాగా నటించాడు” అని ఎమోషనల్ అయ్యారు.
#AamirKhan Could Not Control His Tears After Watching #JunaidKhan's Performance in #EkDin pic.twitter.com/bBDGhTsOiY
— 𝗖𝗜𝗡𝗘𝗠𝗔 𝗨𝗡𝗖𝗘𝗡𝗦𝗢𝗥𝗘𝗗 (@Cine_Uncensored) April 26, 2026
ఏక్ దిన్ స్టోరీ:
ఏక్ దిన్ చిత్రాన్ని అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. మాన్సూర్ ఖాన్, అపర్ణా పురోహిత్ సహనిర్మాతలుగా ఉన్నారు. సునీల్ పాండే ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆయన ఇంతకుముందు డెల్హీ బెల్లీ, లాల్ సింగ్ చద్దా వంటి చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ హార్ట్ టచింగ్ లవ్ & ఎమోషన్తో వచ్చి మెప్పించింది. ఇందులో జునైద్ లో లోపల సిగ్గుపడే రోహన్ అనే యువకుడిగా, సాయి పల్లవి ఉల్లాసంగా ఉండే అమ్మాయిగా మీరా పాత్రలో నటిస్తుంది.
అలా వీరిద్దరూ ఒకే ఆఫీసులో పనిచేస్తున్నప్పటికీ.. ఆమెతో మాట్లాడటానికి అతనికి ధైర్యం ఉండదు. ఇక మీరాను ఇష్టపడే రోహన్.. ప్రేమను వ్యక్తపరచడానికి మాత్రం భయపడుతుంటాడు. జీవితంలో ఒక్క రోజైనా ఆమెతో కలిసి ప్రయాణం చేయాలని కలలు కంటాడు. ఈ క్రమంలోనే కథలో మలుపు జపాన్‌లో జరుగుతుంది. అక్కడ సాయి పల్లవికి ప్రమాదం జరిగి "ట్రాన్సియెంట్ గ్లోబల్ అమ్నీషియా (TGA)" అనే సమస్య వస్తుంది.
ఈ పరిస్థితిలో ఆమెకు తన జీవితంలో ఉన్నవారిలో జునైద్ పాత్ర మాత్రమే గుర్తుంటుంది. ఒక్కోసారి ఒక్క రోజు చాలు.. రేపు ఏం జరుగుతుందో ఎవరికీ గుర్తుండకపోవచ్చు.. అంశాన్ని హార్ట్ టచింగ్గా తెరకెక్కించారు. సినిమాపై భారీ అంచనాలున్నాయి.

