బీజేపీ అతిపెద్ద దుష్టశక్తి : ఆప్ ఎంపీ సంజయ్​సింగ్​

 బీజేపీ అతిపెద్ద దుష్టశక్తి : ఆప్ ఎంపీ సంజయ్​సింగ్​
  • దేశంలో హింసకు పాల్పడుతున్నది: ఆప్ ఎంపీ సంజయ్​సింగ్​

ముషీరాబాద్, వెలుగు: స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం దేశంలో బీజేపీ హింసాత్మక వాతావరణం సృష్టిస్తున్నదని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపించారు. బీజేపీ.. అతిపెద్ద దుష్టశక్తి అని మండిపడ్డారు. లౌకిక ప్రజాతంత్రవాదులంతా ఏకమై బీజేపీని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్​లోని పార్టీ స్టేట్ ఆఫీస్​లో బుధవారం ఆప్ వాలంటీర్ల సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ఆయన చీఫ్ గెస్ట్​గా హాజరై మాట్లాడారు. ‘‘మణిపూర్​లో ఇప్పటికీ హింస కొనసాగుతున్నది.

 అయినా, మోదీ ప్రభుత్వం ఒక్క కామెంట్ చేయడం లేదు. ఎందుకు సైలెంట్​గా ఉంది? మణిపూర్​లో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ శాంతి స్థాపనలో విఫలమైంది. కార్పొరేట్ ఫ్రెండ్స్ కోసమే ప్రధాని మోదీ పని చేస్తున్నారు. పేదల డబ్బులను ఆయన దోస్తులకు దోచిపెడ్తున్నడు. పదేండ్ల పాలనలో అదానీ, అంబానీకి దేశ వనరులన్నీ అప్పజెప్పిండు’’అని సంజయ్ సింగ్ విమర్శించారు.