ముషీరాబాద్, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం యూరియా కొరత లేకుండా చూడాలని ఆప్ రాష్ట్ర కన్వీనర్ హేమా సుదర్శన్ జిల్లోజు కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం వల్ల రైతులు నాట్లు వేయలేకపోతున్నారన్నారు.
శుక్రవారం లిబర్టీలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, హుజూరాబాద్, ఖమ్మం, సూర్యాపేట, నారాయణపేట జిల్లాలో సుమారు 25 నుంచి 30 శాతం వరకు యూరియా కొరత ఉందన్నారు. బుర్ర రాముగౌడ్, మహమ్మద్ సోహెల్ ఖాన్ పాల్గొన్నారు.
